ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఎంత బీభత్సం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రభావం ఇప్పుడు అన్ని దేశాల్లో పడింది.  ముఖ్యంగా ఈ ప్రభావం అమెరికా పైడింది. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో అమెరికాలో 2,494 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 53,928గా ఉంది.

 

అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 9,56,375కి చేరిందని జాన్స్‌ హోప్కిన్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. అమెరికాలో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు వారాల్లో అత్యల్ప మరణాల సంఖ్య ఇదే. ఇంతలోనే మృతుల సంఖ్య భారీగా పెరిగింది.  24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

 

అమెరికాలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  కరోనా కేసులు, మృతుల సంఖ్య ఏ దేశంలో లేనంత అత్యధికంగా అమెరికాలో ఉంది.  ఇక కరోనా వైరస్ ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ లో కూడా తన ప్రభావం విపరీతంగా చూపిస్తుంది.  ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ కరోనా భూతాన్ని మాత్రం తరిమికొట్టలేక పోతున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: