తెలంగాణాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరగడం ఇప్పుడు ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. తెలంగాణాలో ప్రతీ రోజు దాదాపుగా 50 కేసులు నమోదు అవుతున్నాయి.  ఇక ఈ నేపధ్యంలో తెలంగాణాలో లాక్ డౌన్ ని మరికొంత కాలం పెంచే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. త్వరలో తెలంగాణా కేబినేట్ సమావేశం నిర్వహిస్తారని తెలుస్తుంది 

 

రెండు మూడు రోజుల్లో కేబినేట్ సమావేశం నిర్వహించి అప్పుడు లాక్ డౌన్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. హైదరాబాద్ లో కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో... హైదరాబాద్ పై ఏదోక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని సమాచారం జూన్ 14 వరకు లాక్ డౌన్ ని తెలంగాణాలో కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: