కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మిస్సౌరీలో ఒక వ్యక్తి నుంచి 91 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ 91 మందిలో 84 మంది కస్టమర్లు కాగా ఏడుగురు సెలూన్ కార్మికులు కావడం గమనార్హం. మిస్సౌరీలో ఇప్పటివరకు 11,572 కరోనా కేసులు నమోదు కాగా 676 మంది మరణించారు. 
 
వాషింగ్టన్‌లోని స్పోకనే నగరంలోని పాస్తా కర్మాగారంలో పని చేసే 22 మంది కార్మికులు కరోనా భారీన పడినట్టు గుర్తించారు. వాషింగ్ట‌న్‌లో పాక్షిక లాక్‌డౌన్ అమ‌లులో ఉంది. యూఎస్ లోని మొత్తం 50 రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో లాక్‌డౌన్‌ల‌ను ఎత్తివేస్తున్నారు. సెలూన్ వర్కర్ నుంచి కరోనా సోకే అవకాశం ఉండటంతో మన దేశంలో సెలూన్ వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను జారీ చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: