ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏదోక విషయంలో ప్రతీ రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఏదోక వివాదం బోర్డ్ సృష్టించడమో అక్కడి అధికారులు సృష్టించడమో  జరుగుతూనే ఉంది. టీటీడీ భూముల అమ్మకం గురించి వివాదం నిన్నటితో ముగియగా మరో వివాదం మొదలైంది. 

 

సోషల్ మీడియా వేదికగా టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్‌ జరగాలని రమణ దీక్షితులు సోషల్ మీడియాలో డిమాండ్ చేయడం విశేషం. ఎన్టీఆర్‌ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్‌ జరపాలని ఆయన కామెంట్ చేయడం గమనార్హం. తన డిమాండ్లను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి ట్వీట్‌ చేసారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: