మహబూబాబాద్ లో జర్నలిస్ట్ కుమారుడు కిడ్నాప్ కేసు ఇప్పుడు సంచలనం అయింది. కిడ్నాప్ కేసు   ఏ మలుపు తిరుగుతుందో గాని అందరూ కూడా ఆసక్తిగా, ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. కిడ్నాపర్ లు ఫోన్ చేయడం మాత్రం ఆపడం లేదు. ఇక దీక్షిత్ కిడ్నాప్ కేసులో పోలీసులకు కూడా ఏ విధమైన ఆధారాలు రాలేదు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు బాలుడి తల్లికి మరోసారి ఫోన్ చేసిన కిడ్నాపర్... డబ్బులు కావాలి అని డిమాండ్ చేసాడు.

45 లక్షలు రెడీ చేసి వీడియో కాల్ ద్వారా తనకు చూపాలని కిడ్నాపర్ డిమాండ్ చేసాడు. ఎక్కడికి తేవాలో మరోసారి ఫోన్ చేస్తానని కిడ్నాపర్ పేర్కొన్నాడు. దీనితో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఫోన్ బీహార్ నుంచి వచ్చింది అని ముందు అధికారులు గుర్తించారు. వాళ్ళు ఇంటర్నెట్ కాల్ చేయడంతో అధికారులు  జాగ్రత్తగా గమనిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: