కరోనా వైరస్ పై చేసే పోరాటం విషయంలో భారత్ చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూస్తూ ఇండియా ముందుకు వెళ్తుంది. ఇక రికవరీ రేటు విషయంలో ఇండియా చాలా దూకుడుగా ఉంది. ప్రతీ రోజు కూడా 70 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని బయటపడుతున్నారు. 8 లక్షల లోపే కరోనా  యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రాలు కూడా చాలా  వరకు కూడా దూకుడుగా ఉన్నాయి. ఇక తాజాగా కరోనాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా రోగులు నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఇది జాతీయ రికవరీ రేటులో పెరుగుదలకు దారితీసిందని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రికవరీ రేటు ఇండియాలో 90 శాతం వరకు ఉందని కేంద్రం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: