చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా య‌శ్‌వ‌ర్ధ‌న్ కుమార్ సిన్హాను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24వ తేదీన అత్యున్న స్థాయి సెలక్షన్ ప్యానెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐసీగా య‌శ్‌వ‌ర్ధ‌న్ నియామకంపై ప్యానెల్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్యానెల్ సభ్యుడిగా కొనసాగుతున్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ మాత్రం య‌శ్‌వ‌ర్ధ‌న్ నియామకంపై విముఖత చూపారు. సీఐసీ చీఫ్ ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పారదర్శకాలను ప్యానల్ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.

గత రెండు నెలలుగా సీఐసీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో పనిచేసిన సిన్హా ఇటీవలే రిటైరయ్యారు. శ్రీలంక, యూకేలో ఆయన భారత హై కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ప్రారంభంలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సభ్యుడిగా  నియమితులయ్యాడు. కాగా, ఆగస్టు నెలలో మాజీ చీఫ్ బిమాల్ జుల్కా పదివీ విరమణ చేయడంతో ప్రభుత్వం ఎవరిని నియమించలేదు. ఈ మేరకు సిన్హాను సీఐసీగా నియమించే యోచనలో ఉన్నారు. కాగా, నీరజ్ కుమార్ గుప్తా కూడా సీఐసీ పదవి కోసం పోటీ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: