తెలుగుదేశం పార్టీ నేతలు జైలు భరోకి పిలుపునిచ్చిన నేపధ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. జిల్లా జైలు వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించిన అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. జైల్ భరో నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు అని ఆయన అన్నారు. జైల్   భరో కు ఎలాంటి అనుమతి లేదు  అని స్పష్టం చేసారు. కోవిడ్ నిబంధనలు మేరకు ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశాం అన్నారు.

10 చోట్ల చెక్ పోస్టులు, 4 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశాము అని ఆయన తెలిపారు. మొత్తం 3 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు అని ఆయన అన్నారు. నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు. కాగా జిల్లా జైలు వద్దకు భారీగా నేతలు చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: