సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. తాజాగా ఏపీ విద్యా శాఖాకు సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటీ అంటే... ఏపీ స్కూల్స్ కి కొన్ని రోజులు సెలవలు కరోనా అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై మంత్రి ఆదిములపు సురేష్ స్పందించారు. గత కొన్ని రోజులుగా పాటశాలకు సెలవు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ వాస్తవం లేదు అని ఆయన స్పష్టం చేసారు.

కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు అని అన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం..దీన్ని ఎవరు వైరల్ చేయద్దు అని స్పష్టం చేసారు. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసామని చెప్పారు. సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యధావిధిగా పాఠశాలలు నడుస్తాయి.. అందులో ఎటువంటి సందేహం లేదు అని స్పష్టం చేసారు. జునియర్ కళాశాలలు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: