దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ధరించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ ను కట్టడి చేసేందుకు వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం వెల్లడించారు.

కర్ఫ్యూ సమయంలో మాల్స్‌, జిమ్‌లు, ఆడిటోరియంలు, స్పా సెంటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రెస్టారంట్లలో కేవలం హోండెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని, సినిమా థియేటర్లను 30శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని కేజ్రీవాల్‌ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: