కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి మే 22 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండనుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. వ్యాక్సిన్ కొర‌త‌ను నివారించేందుకు తెలంగాణ కేభినేట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ కొలుగోలుకు గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిల‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇక అంతేకాకుండా ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

KCr