శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడను తలపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 81  పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కోర్ బోర్డుపై 63 పరుగులు కూడా రాకముందే 8 వికెట్లు కోల్పోయింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శిఖార్ ధావన్... తన నిర్ణయం తప్పు అని తెలుసుకునేందుకు ఎంతో సేపు పట్టలేదు. బౌలర్లకు అనుకూలించే పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ పరుగులు చేసేందుకు నానా పాట్లు పడ్డారు. ఫస్ట్ ఓవర్ నాల్గవ బాల్ కే కెప్టెన్ ధావన్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పడిక్కల్ 9 రన్స్ చేసి అవుటవ్వగా... సంజు శాంసన్ కూడా ధావన్ బాటలోనే పరుగులేం చేయకుండానే హసరంగ బౌలింగ్ లో అవుటయ్యాడు. 2 బౌండరీలు సాధించిన గైక్వాండ్ 14 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. నితిష్ రాణా 6 రన్స్ కే పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్, కులదీప్ జోడీ కొద్దిసేపు ఆడినప్పటికీ... లంక బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 16 రన్స్ చేసిన భువనేశ్వర్ ను హసరంగ అవుట్ చేయగా... రాహుల్ చాహర్ 5 పరుగులు చేసి షనక బౌలింగ్ లో అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ లో ముగ్గురు మాత్రమే రెండకెల స్కోరు చేయగా... ముగ్గురు ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ ముగిసిసరికి టీమిండియా లంకకు 82  పరుగుల టార్గెట్ ఇచ్చింది. కుల్ దీప్ యాదవ్ ఒక్కడే 23 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లంక బౌలర్లలో హసరంగ 9 పరుగులిచ్చి 4వికెట్లు పడగొట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: