ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొన్ని వ్యవహారాలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. పదవుల విషయంలో కొందరికి అన్యాయం జరుగుతుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ అధినేత పై కూడా విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసుకు అసమ్మతి సెగ గట్టిగా తగిలింది. ఎంపిపి పదవి కోసం అధికార పార్టీలో విభేదాలు వచ్చాయి.

ఎంపిపి పదవి ఆశించి భంగపడ్డ సుసరాం ఎంపిటిసి తమ్మినేని శారద... పార్టీపై గుర్రుగా ఉన్నారు. చీడివాలస ఎంపిటిసి దమయంతిని ఎంపిక చేసారు కృష్ణదాసు. కృష్టదాసు తీరుకు నిరసనగా సుసరాంలో శారద వర్గీయులు ధర్నాకు దిగారు. ఇచ్చిన మాట తప్పి... మోసం చేశారంటున్న శారద వర్గం... తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కూడా పార్టీ నేతల మధ్య పదవుల విషయంలో విభేదాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: