విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్‌. ఇప్పుడు ఈ చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. బాక్సింగ్ అంటే మైక్ టైస‌న్‌, మైక్ టైస‌న్ అంటే బాక్సింగ్ అనుకునేంత‌గా క‌లిసిపోయి త‌న‌ను తాను నిరూపించుకున్నారు టైస‌న్ ఇప్పుడు మైక్ టైస‌న్ తొలిసారి భార‌తీయ వెండితెర‌పై న‌టించ‌బోతున్నారు. క‌థానాయ‌కుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి తెర‌ను పంచుకోబోతున్నారు. దీనికి సంబంధించి చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, పూరీ క‌నెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్‌రాయ్‌, గెట‌ప్‌శ్రీ‌ను, విష్ణురెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అన‌న్య‌పాండే న‌టిస్తోంది. భార‌తీయ వెండితెర‌కు టైస‌న్ ఈ చిత్రంద్వారా ప‌రిచ‌యం కాబోతుండ‌టం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చిత్ర‌బృందం చెప్పింది. ఈ చిత్రానికి సంగీతాన్ని మ‌ణిశ‌ర్మ‌, త‌నిష్క్ బాఘ్చి అందిస్తున్నారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: