పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ మంట రోజురోజుకూ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల స్థిరీకరణ పేరుతో చ‌మురు కంపెనీలు ప్ర‌జ‌ల‌ను గ్యాప్‌ లేకుండా బాదుతున్నాయి. దీంతో శుక్ర‌వారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే వేగం, ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు. శుక్ర‌వారం, అక్టోబర్ 22న చ‌మురు ద‌ర‌లు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగి ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.  ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.54పైస‌లుగా ఉంటే డీజిల్‌ ధర రూ.95.27కు చేరుకున్నాయి. అటు ముంబ‌యిలో  లీటరు పెట్రోల్‌ ధర రూ.112.78కి, డీజిల్‌ ధర రూ.103.63కి చేరుకున్నాయి. దేశంలోనే అత్య‌ధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు బాగా ఎగ‌సిప‌డుతున్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉండ‌ట‌మ‌నేది దేశంలోనే అత్య‌ధికం.

మరింత సమాచారం తెలుసుకోండి: