ఇటీవల దివంగతులైన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్‌ గ్రహీత రామోజీరావు విగ్రహం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు విజయనగరం ఎంపీ కిలిశెట్టి అప్పలనాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని విజయనగరం ఎంపీ కిలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.


హైదరాబాద్, విశాఖ, అమరావతి తో పాటు తెలుగు వారు ఎక్కువుగా ఉన్న దిల్లీ, ఒడిశా, చెన్నై, బెంగుళూరు, ముంబై తదితర ప్రాంతాల్లో మిగిలిన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని విజయనగరం ఎంపీ కిలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. నిన్న ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన విజయనగరం ఎంపీ కిలిశెట్టి అప్పలనాయుడు.. ఈ విషయాలు వెల్లడించారు. అయితే.. విశాఖలో రూపొందించిన రామోజీరావు విగ్రహం లాంటివి తమకూ ఇవ్వాలని కలిశెట్టిని  రాజధాని రైతులు కోరారు. రాజధానికి అమరావతి పేరు సిఫార్సు చేయటం తో పాటు ఉద్యమానికి రామోజీరావు అందించిన సహకారాన్ని రైతులు గుర్తు చేసుకున్నారు. తాను మొత్తం 15విగ్రహాలు రూపొందింస్తున్నాని, అందులో ఒకటి అమరావతి కి ఇస్తానని రైతులకు కలిశెట్టి అప్పలనాయుడు  హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: