సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తుంటారు. పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోకుండా చూసుకుంటారు. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చలానాలు విధిస్తారు. ఒకవేళ వాహనాలకు సంబంధించిన పత్రాలు లేనప్పుడు సీజ్ చేస్తారు. అలా వాటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. యజమాని వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను చూపించి వాహనాలను తీసుకోవచ్చు. బైక్‌పై చలాన్లు ఉంటే కట్టి తీసుకెళ్లే సమయంలో వివరాలను నమోదు చేసుకుంటారు.

ఈ వాహనాల వివరాలు నమోదు చేసుకునే పనికి ఒక హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుంది. వివిధ కారణాలపై సీజ్‌ చేసిన వాహనాల వివరాలు నమోదు చేసుకోవడం వీరి బాధ్యత. కానీ ఆ వాహనాలను సంరక్షించాల్సింది పోయి ఒక అధికారి దొంగగా మారి.. వాటిని అమ్మేస్తోంది. ఒక డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని సీజ్ చేసిన వాహనాలను బేరానికి పెట్టి విక్రయిస్తోంది. అయితే ఈ విషయంపై పలు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు రెక్కీ నిర్వహించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని విచారణ చేపట్టారు.

మహారాష్ట్రలోని వసాయి పోలీస్‌ స్టేషన్‌లో స్టోర్‌ క్లర్క్‌గా మంగళ్ గైక్వాడ్‌ అనే మహిళా హెడ్ కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తోంది. వివిధ కారణాల వల్ల సీజ్‌ చేసిన వాహనాల వివరాలు నమోదు చేయడం ఆమె బాధ్యత. అయితే ఆమె వాటిని స్క్రాప్ డీలర్ ముస్తాక్‌తో డీలింగ్ కుదుర్చుకుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియడంతో.. పోలీసులు రెక్కీ నిర్వహించారు. స్క్రాప్ డీలర్ ముస్తాక్‌కు వాహనాలు విక్రయించే సమయంలో గైక్వాడ్‌ను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో దాదాపు రూ.26 లక్షల విలువైన వాహనాలను అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే ప్రస్తుతం స్క్రాప్ డీలర్‌ ముస్తాక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆమెను సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. వసాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణ్‌ కార్పే తెలిపారు. అయితే బాధ్యతాయుత పోలీస్ కానిస్టేబుల్ ఇలాంటి పనికి పాల్పడటంపై పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులే సీజ్ చేసిన వాహనాలు బ్లాక్‌లో అమ్మేస్తుంటే.. దొంగలకు, పోలీసులకు తేడా ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: