ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎంతో రద్దీగా కనిపించే ప్రాంతాలలో సైతం ఎక్కువగా జనం మాత్రం కనిపించడం లేదు. ఏదైనా అవసరం ఉంటేనే బయటకి వస్తున్నారు. అయితే ఇలా జనాలు లేకపోవడమే అతనికి ఎంతగానో కలిసివచ్చింది.. కరోనా వైరస్ కారణంగా జనాలు బయటకు రాకపోవడం తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఇక్కడ గొలుసు దొంగ. ఇంకేముంది పక్కా ప్లాన్ ప్రకారం ఎన్నో ప్రాంతాలలో గొలుసు దొంగతనాలకు పాల్పడి తన చేతివాటాన్ని చూపించాడు. ఇక ఒంటరిగా వెళ్తున్న మహిళల నే టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోవడం  మొదలు పెట్టాడు ఆ గొలుసు దొంగ. అయితే బాధితుల్లో ఒకరూ ఎస్సై భార్య కూడా ఉండటం గమనార్హం.


 ఇకపోతే ఇటీవలే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా గొలుసు చోరీలు జరుగుతూ ఉండటం పోలీసులకు సవాలుగా మారిపోయింది. కేవలం గొలుసు  దొంగతనాలు మాత్రమే కాదు ఏకంగా ఇంటి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలను కూడా దొంగలించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఒక స్కూటీ దొంగలించాడు సదరు వ్యక్తి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగ ఆచూకీ తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఒకే ఒక్కడు హైదరాబాద్ నగరం నడిబొడ్డులో, శివార్లలో కూడా ఐదు చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు అన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు.



 ఈ  క్రమంలోనే ఇలా గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ముఖకవళికలు అతడు దొంగలించిన స్కూటీ నెంబర్ ఆ సంఘటన జరిగిన సమయానికి సంబంధించిన వివరాలను కూడా బాధితుల నుంచి సేకరిస్తున్నారు. అయితే ఇక ఇటీవల కాలంలో వరుసగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఆ దొంగ పోలీసులు మాత్రం సవాళ్ళు విసురుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ వరుసగా గొలుసు దొంగతనాలు వెలుగులోకి వస్తుండడంతో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లాలి అంటేనే  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం.

మరింత సమాచారం తెలుసుకోండి: