రాజకీయంలో ఒక పని ఒకళ్ళు చేస్తే రైట్, మరొకళ్ళు చేస్తే రాంగ్ అన్నట్టుంది ఇప్పుడు అని కొంతమంది అంటున్నారు. ఎందుకు అంటే దానికి సంబంధించి వైఎస్సార్సీపీకి ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తున్నారు. విషయంలోకి వెళ్తే అవినాష్ రెడ్డి మొన్న విచారణకు రమ్మంటే నాలుగు రోజులు రాలేనని, ఇప్పుడు మళ్లీ మరోసారి విచారణకు పిలుస్తుంటే ఇప్పుడు మళ్లీ తన తల్లి అనారోగ్యాన్ని చూపించి వాయిదా వేస్తున్నారని కొంతమంది అంటున్నారు.


జరిగిన దాని ప్రకారం అవినాష్ రెడ్డి తన తల్లిని కర్నూల్ హాస్పిటల్ కి తీసుకువచ్చి జాయిన్ చేయడం, డాక్టర్ అక్కడ పది రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పడం జరిగిందట. ఈ కారణం తోనే అవినాష్ రెడ్డి విచారణకు రాలేకపోయారని అంటున్నారు వాళ్ల వర్గాలు. అయితే దీనిపై ఇదంతా నిజం కాదు అని కొంతమంది అవతలి వాళ్ళు అంటున్నారు. అయితే మొన్న అచ్చం నాయుడుకు పైల్స్ ఆపరేషన్ జరిగితే బలవంతంగా తీసుకు వెళ్లిపోయారని, దానితో ఆయన రక్తస్రావంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకు వచ్చారు. తీరా చూస్తే ఆయన ఆ తర్వాత నడుచుకుంటూ మామూలుగా వెళ్లిపోయారట.


మరో పక్కన రామోజీరావు విషయంలో చూస్తే యాక్చువల్ గా నిజానికి ఆయన డైలీ ఆక్టివిటీస్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ సిఐడి వాళ్లు వెళ్ళగానే ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. నడుం నొప్పి వచ్చి అప్పటివరకు మాస్క్ పెట్టుకోకపోయినా సరే మాస్క్ పెట్టుకుంటారు. అలాగే సెలైన్ లేకుండానే ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అని కొంతమంది అడుగుతున్నారు.


మరి దీనిలో ఎంత నిజం ఉంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటనను బట్టి తెలిసేది ఏమిటి అంటే ఎవరి వాళ్ళ మీద వాళ్ళు సింపతి చూపించుకుంటారు. అలాగే అవతలి వాళ్ళ మీద అనుమానంతో విషం చిమ్ముతూ ఉంటారు. నిజాలతో సంబంధం ఉండదు అసలు నిజం ఉంటుందో, ఉండదో కూడా తెలియకుండా జరుగుతున్న చర్చలు ఇవి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: