
భూగోళం నిరంతరం మారుతూనే వస్తుంది. అయితే ఈ మార్పులు అప్పటికప్పుడు కనిపించేవి కావని వీటికి సహజంగానే వేల సంవత్సరాలు పడుతుందని అయితే తాజాగా అలాంటి భారీ మార్పే ఆఫ్రికా ఖండంలో చోటుచేసుకోబోతుందని చెప్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఆఫ్రికా ఖండం రెండుగా చీలి రెండు ఖండాలుగా మారిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వీటి మధ్య కొత్తగా ఒక సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ మార్పుని శాస్త్రవేత్తలు తూర్పు ఆఫ్రికా చీలికగా చెబుతున్నారు.
భూగర్భంలోని ఒక పలక టెక్టోనిక్ ప్లేట్ రెండుగా విడిపోవడాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు చీలికగా పరిగణిస్తారు. ఈ పలకలు కదలడం మొదలైనప్పుడు లో ఇలాంటి పగుళ్లు భూగర్భంలోనూ, ఇంకా భూఉపరితలం పైన కూడా ఏర్పడతాయి. 138 మిలియన్ సంవత్సరాల క్రిందట ఇలాంటి పరిణామం వల్లనే దక్షిణ అమెరికా ఇంకా ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. 2005లో ఇధియోపియా ఎడారిలో 506 కిలోమీటర్ల పొడవున భారీ పగులు సంభవించింది. 2018లో కెన్యాలోనూ ఇలాంటిదే భారీ పగులు కనిపించింది. సముద్రం కింది అడుగుభాగంలో పలకల కదలికల కారణం వల్ల ఇది సంభవించింది అని పరిశోధకులు చెప్తున్నారు.
ఆఫ్రికా సుబియన్, ఆఫ్రికా సోమాలి, అరేబియన్ అనే పలకల పగుళ్ళను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి సంకేతంగా భావిస్తున్నారు. భూగర్భంలో మొదలయ్యే పగులు ఉపరితలంపైకి చేరి సముద్రాల ఆవిర్భావానికి కారణమౌతుందని లీడ్స్ విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్తున్న ఒక పరిశోధన.