
వాళ్ళందరూ ఇప్పుడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ఒక్కటవుతున్నారు. దానికి పోలాండ్ ప్రధాన కారణం అవుతుందట. ఇప్పుటి వరకు ఏంటంటే రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఈ మద్య రష్యా లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల మీద ఉక్రెయిన్ దాడి చేస్తుంది. రష్యా అయితే పూర్తిగా ఆక్రమించే దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎదురు దాడి చేస్తే మాత్రమే గెలవగలమనే జెలెన్ స్కి మాటలకు సంఘీ భావంగా అతడికి కావాల్సిన యుద్ధ విమానాలు, ఆయుధాలు, మిస్సైల్స్ ఇచ్చి రష్యా లోపల ఉన్న ప్రాంతాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించడం ద్వారా రష్యా ఇప్పుడు ముందు ఉక్రెయిన్ మీద దాడి చేస్తూ తన దేశంలో దర్జా గా ఉంది.
కాబట్టి, రష్యా మీద కూడా ఉక్రెయిన్ దాడి చేస్తుంటే ఈ నాటో దేశాల ఆయుధాలను, విమానాలను పెట్టుకొని అప్పుడు రష్యా కూడా నాశనం అవుతుంది. ఇప్పటిదాకా ఏంటంటే ఆర్థికంగా దెబ్బతింటున్నా గాని సైనిక పరంగా, జనాలపరంగా దెబ్బ తినడం లేదు, ఆస్తులపరంగా దెబ్బ తినడం లేదు కాబట్టి అలా దెబ్బ తీయించడం ద్వారా రష్యా ని సెకండ్ ఫేస్ నాశనం చేయబోతున్నారనే విషయం స్పష్టం అవుతుంది.