రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో ఉక్రెయిన్ సైనికులు దాక్కున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని రష్యా వైమానిక దాడులకు దిగుతోంది. దీంతో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం దండకారణ్యంలో ఉన్న నక్సలైట్లపై వైమానిక దాడులు జరుగుతున్నాయని నక్సలైట్లు దాని అనుబంధ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఏపీలో గుంటూరులో జరిగిన ఒక సభలో పౌర హక్కుల సంఘం గుంటూరులో మీటింగ్ పెట్టింది. దండ కారణ్యంలో జరుగుతున్న వైమానిక దాడులను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పౌర హక్కుల సంఘం కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తక్షణమే వైమానిక దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. దండ కారణ్య ప్రాంతంలో విలువైన ఖనిజ సంపదలను దోచుకోని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.


అక్కడ ఉన్న ఆదివాసీలను తరిమివేసే చర్యలు మానుకోవాలని హితువు పలికారు. వైమానిక దాడులు పై నిజ నిర్దారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని పౌర హక్కుల సంఘం నేేతలు మాట్లాడుతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అక్కడ దాక్కున్న మావోయిస్టుల ఏరివేతలో కొన్ని సార్లు కూంబింగ్ చేస్తున్నట్లు సాధారణంగా పోలీసులే ప్రకటిస్తూ ఉంటారు. పోనీ రష్యా, చైనా లాంటి దేశాల్లో కమ్యూనిస్టుల పార్టీలే అధికారంలో ఉన్నాయి. మరి అక్కడ దాడులు జరగకుండా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను విమర్శించడమే వీరి పని అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు.


అడవిని మొత్తం నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం గనక అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలు ఊరుకుంటాయా? పోనీ దండకారణ్యంలో ఎలాంటి బాంబులు వేశారు. ఎక్కడ వేశారు. అనే వివరాలు తెలపకుండా ఊరికే ఆరోపణలు చేయడం పౌర హక్కుల నేతలకు అలవాటుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యువతను కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని పౌర హక్కుల సంఘం నేతలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: