పాలన విషయంలో తేడా వస్తున్నటువంటి వాళ్లకి జగన్మోహన్ రెడ్డి నుండి టిక్కెట్లు మార్చేస్తామని వార్నింగ్స్ అయితే వస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి మరో నెల రోజులు గడువు ఇచ్చారని తెలుస్తుంది. ఇంటింటికి వైఎస్సార్సీపి ప్రభుత్వం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే కాక పబ్లిక్ తో ఇంటరాక్షన్, అంటే నిత్యం పబ్లిక్ తో ఇంటరాక్షన్ లో ఉంటూ లోపాలను సరిచేసుకునే పని కూడా చేయాలి అని చెప్పారని తెలుస్తుంది.


ఆ లోపాలు ప్రభుత్వానివైతే మేమేం చేస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఎమ్మెల్యేలు ఎవరి పెర్ఫార్మన్స్ వాళ్ళు మెరుగుపరుచుకోవాలి కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే కోసం ఒక్కొక్క పాలసీ పెట్టలేం కదా అని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఏది నిజం అన్నది తేలాల్సి ఉంది‌. అయితే ఇప్పుడు వాళ్ళ పెర్ఫార్మన్స్ కి మూడు రకాల రంగుల గుర్తులు ఇస్తున్నారట.


తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే గ్రీన్, రెడ్, ఆరంజ్ రంగులను వీళ్లకు ఇస్తున్నారని తెలుస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్లకి ఇచ్చిన రంగులు చూస్తే మనకు అర్థమవుతుంది. నెల్లూరు సిటీ అనిల్ కుమార్ కి ఆరంజ్ ఇచ్చారట, అంటే పెర్ఫార్మన్స్ సాటిస్ఫ్యాక్టరీ అని అర్థం అంట.


నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి కన్వీనర్ కి ఆరంజ్ వచ్చిందట. అలాగే ఆత్మకూరు మేకపాటి విక్రమ్ కి గ్రీన్, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డికి గ్రీన్ వచ్చాయి. ఉదయగిరి వైయస్సార్సీపి కార్యకర్తలకు గ్రీన్ , వెంకటగిరి వైయస్సార్ సిపి కన్వీనర్ కి ఆరంజ్ వచ్చాయి సూళ్లూరుపేట సంజీవయ్యకి గ్రీన్ వచ్చిందట. గూడూరు వరప్రసాద్ కి రెడ్ వచ్చింది, అంటే ఆయనకి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని తెలుస్తుంది. కొవ్వూరు ప్రసన్నకుమార్ కి గ్రీన్ వచ్చిందట కావలి ప్రతాపరెడ్డికి ఆరెంజ్ వచ్చిందట. ఆయా నియోజకవర్గాల్లో వారి పెర్ఫార్మన్స్ బట్టి ఇలా రంగుల ద్వారా గ్రేడింగ్ చేస్తారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: