
కాంగ్రెస్ ఆర్ టీం రేవంత్ రెడ్డి కి సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెస్ ఓల్డ్ టీమ్ పార్టీలోనే ఏళ్ల తరబడి ఉండి పార్టీ కోసం పోరాడేవారు. ఇలా గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ టీ టీమ్ లో ఉన్న కొంతమంది సభ్యులు ఏకంగా బీఆర్ఎస్ నాయకులతో చర్చలు జరిపి ఎక్కడైతే బీఆర్ఎస్ వీక్ గా ఉందో అక్కడ నామమాత్రపు క్యాండేట్ ను పెట్టి కాంగ్రెస్ ను గెలిపించుకునేలా ప్లాన్ లు చేస్తున్నట్లు సమాచారం.
మరో విషయం ఆ గెలిచిన వ్యక్తి కూడా బీఆర్ఎస్ కు మద్దతు పరోక్షంగా తెలుపుతూనే ఉంటాడు. కాంగ్రెస్ ఓల్డ్ టీమ్ లో ఉత్తమ్, జానా, జగ్గారెడ్డి లాంటి సీనియర్లు ఉంటే కాంగ్రెస్ ఆర్ టీమ్ లో రేవంత్ రెడ్డి, మల్లురవి, అద్దంకి దయాకర్ లు ఉన్నారు. ఇలా ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.
నల్గొండలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి పడటం లేదు. ఉప్పు నిప్పులా తయారయ్యారు. ఇదే సమయంలో నల్గొండలో సభను క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది. కాస్తో కూస్తో కాంగ్రెస్ కు ఆధిపత్యం ఉందంటే అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాబట్టి అక్కడ సీనియర్లు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. లేకపోతే రేవంత్ రెడ్డికి కష్టాలు తప్పవు.