
ఇలాంటి కొన్నికఠిన నిర్ణయాలను కేంద్రంలో బీజేపీ తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం లాంటి విషయాల్లో సక్సెస్ సాధించింది. ఈ సమయంలో బీజేపీ ఎజెండాలో ఉన్న మరో ముఖ్యమైన అంశం కామన్ సివిల్ కోడ్. ప్రస్తుతం దేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతోంది. కర్ణాటక ఎన్నికల మెనిఫేస్టోలో బీజేపీ దీన్నే ప్రధానాస్త్రంగా తీసుకుంది. అక్కడ జరిగిన హిజాబ్ వివాదం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఒక్క ముస్లింకు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు.
కామన్ సివిల్ కోడ్ తెస్తామనే ప్రధాన హామీతో పాటు, మ్యాన్ పాక్ఛరింగ్ రంగంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది. పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం, అయిదు కేజీల తృణ ధాన్యాలు, నెలవారీ రేషన్ కిట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి అర లీటర్ నందిని పాలు, ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు, నిరాశ్రయులకు పది లక్షల ఇళ్ల స్థలాలు, వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రిజీయన్ ట్యాగ్, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్ డ్ డిఫాజిట్ పథకం లాంటివి ప్రవేశపెడతామని బీజేపీ ఎన్నికల మెనిఫేస్టోలో తెలిపింది.