ఏ పార్టీలో ఉన్నా సరే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కి ఉండే గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంగ బలం.. ఆర్థిక బ‌లం రెండూ ఆయ‌న సొంతం.. అన్నింటికి మించి రాజకీయ వ్యూహ చ‌తుర‌త కూడా గంటా సొంత‌మే అని చెప్పాలి. అధికారం ఎక్క‌డ ఉంటే అక్క‌డకు చేరుకోవ‌డంలో గంటాను మించిన నేత లేరంటే అతిశ‌యోక్తి కాదేమో..?  అంగ‌, ఆర్ధికంగా బలంగా ఉండే నేత కాబట్టి ఆయనతో కొందరు నేతలు ఎప్పటికప్పుడు టచ్ లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉంటూ ఉంటారు. ఆయన కూడా తన అవసరానికి తగిన విధంగా అందరితో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. 

 

ఆయన ఏ పార్టీలో ఉన్నా కీలకమే. ఆయన తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తాడు అనే పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక గ‌త యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా స్వ‌ల్ప మెజార్టీతో విజ‌యం సాధించారు. అయితే గెలిచిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న టీడీపీకి.. చంద్ర‌బాబుకు పూర్తి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆయ‌న వెళ్ల‌డం లేదు స‌రిక‌దా.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ గురించి ఎంత మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అటు టీడీపీ అధిష్టానం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన బిజెపి లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది పక్కన పెడితే రాజ్యసభ సీటు కోసం గంటా ప్రయత్నాలు చేస్తున్నారు అని... ప్ర‌స్తుతం బీజేపీకి చెందిన మాజీ టీడీపీ నేత‌.. సీఎం రమేష్ ద్వారా ఆయన ఢిల్లీ లో ఇప్పుడు లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఆయన అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే త్వరలోనే బిజెపి తీర్ధం పుచ్చుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు ఏంటీ అనేది త్వరలోనే స్పష్టత వస్తుంది. ఆయనకు కేంద్ర మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయి వాటిని ఈ విధంగా వాడుకునే ప్రయత్నాలు  గంటా చేస్తున్నారు అన్న టాక్ కూడా విశాఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: