ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డదిడ్డమైన కేసులు వేసిన వారికి హైకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమంది అనేక కేసులు హైకోర్టులో దాఖలు చేశారు. వాటిల్లో మూడింటి విషయంలో పిటీషనర్లకు న్యాయమూర్తులు ఫుల్లుగా క్లాసు పీకారు. అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తన్నారన్నట్లుగా వ్యాఖ్యానించటమే కాకుండా ప్రభుత్వ చర్యలకు మద్దతుగా మాట్లాడటం గమనార్హం. మామూలుగా ప్రభుత్వానికి హైకోర్టు పూర్తిగా వ్యతిరేకమనే అభిప్రాయం అధికారపార్టీతో పాటు జనాల్లో కూడా పాతుకుపోయింది. ఇటువంటి అభిప్రాయానికి అనేక కారణాలున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కేసు వేసినా వెంటనే అడ్మిట్ చేసేసుకోవటం, ప్రభుత్వానికి ముందుకు పోనీకుండా స్టే ఇచ్చేయటం, ప్రభుత్వానికి కౌంటర్లు వేయాలంటు ఆదేశించిన సందర్భాలు చాలానే జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే వివిద కేసుల విచారణలో న్యాయమూర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వ పెద్దలకు బాగా మండిపోతోంది. దాంతో ప్రత్యక్షంగానే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు హైకోర్టుకు మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైపోయింది.





ఇటువంటి నేపధ్యంలోనే మంగళవారం విచారణకు వచ్చిన మూడు కేసుల్లో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి మద్దతుగా ఉండటం విశేషం. వైఎస్సార్ చేయూత పథకంలో తమకు లబ్ది అందలేదంటు 20 కేసు వేశారు. దీన్ని విచారించిన బట్టు దేవానంద్ మాట్లాడుతు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటిల్లోని మహిళల అభివృద్దికి మంచి పథకాలు తీసుకొచ్చిందని ప్రశంసించారు. అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి ఫలాలు అందరికీ అందటం లేదన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల పైన కూడా విచారణ జరిగింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ జేకే  మహేశ్వరి మాట్లాడుతు మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎంకు దురుద్దేశాలున్నాయని ఎలా చెబుతారని పిటీషనర్ ను నిలదీశారు. ఏమైనా ఆధారాలుంటే చూపమన్నపుడు పిటీషనర్ చేతులెత్తేశారు. అలాగే రాజధాని నగరంలోనే హైకోర్టు ఉండాలని ఏ చట్టంలో ఉందో చూపమన్నారు. రాజధాని ఒకచోట హైకోర్టు మరోచోట ఉన్న రాష్ట్రాలు మనదేశంలోనే ఉన్న విషయం తెలసు అంటూ పిటీషనర్ ను ప్రశ్నించారు.





మూడో కేసుగా పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయటం వల్ల రూ. 4 వేల కోట్లు ఖర్చయిందని డాక్టర్ మద్దిపాటి శైలజ కేసు వేశారు. కాబట్టి ఆ మోత్తాన్ని మంత్రులు, ఉన్నతాధికారుల నుండే వసూలు చేయాలని కోరారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి మాట్లాడుతు రంగులు వేయటానికి రూ. 4 వేలు ఖర్చయినట్లు ఏమన్నా ఆధారాలున్నాయా అంటు నిలదీశారు. ఒక్కో కార్యాలయానికి  రూ. 4 వేలు అయ్యిందనుకున్నా 10 వేల కార్యాలయాలకు రూ. 4 వేల కోట్లయితే ఖర్చు కాదు కదా అని ప్రశ్నించారు. అసలు ఏ లెక్కల ఆధారంగా కేసు వేశారో చెప్పమని అడిగినపుడు పిటీషనర్ ఏమీ మాట్లాడలేకపోయారు. ప్రభుత్వంపై దాఖలవుతున్న కేసుల విషయంలో హైకోర్టు న్యాయమూర్తుల్లో మారుతున్న ధృక్పదానికి తాజాగా కేసుల విచారణే నిదర్శనమని అర్ధమవుతోంది. ఒకపుడు ఇదే కేసుల విషయంలో న్యాయమూర్తులు రెచ్చిపోయిన ఘటనలు అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు ఉల్టాగా మాట్లాడుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: