వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుకు మరోషాక్ తగిలింది. చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. నాటకాన్ని నిషేధించడం పై ఎంపీ  రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామకృష్ణంరాజు తరపున ప్రముఖ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్రాన్ని హరించడమే ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.


ఈ నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవన ఉపాధి కోల్పోయారని రఘురామ తరపు లాయర్ ఉమేశ్ వాదనలు వినిపించారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందని రఘురామ తరపు లాయర్ ఉమేశ్ గుర్తు చేశారు. ఈ నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదని రఘురామ తరపు లాయర్ ఉమేశ్ వాదించారు. ఈ నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా రఘురామ తరపు లాయర్ ఉమేశ్ హైకోర్టును అభ్యర్థించారు.


అయితే.. రఘురామ తరపు లాయర్ ఉమేశ్ వాదనను, అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం ట్రాన్సలేషన్‌ కాపీని సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.  ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17 కు వాయిదా వేసింది.


ఇక ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే.. కాళ్లకూరు నారాయణరావు చాలా దశాబ్దాల క్రితం ఈ చింతామణి నాటకాన్ని రచించారు. అది బాగా ప్రాచుర్యం పొందింది. అయితే.. అందులోని సుబ్బిసెట్టి పాత్ర  ఆ తర్వాత  క్రమంగా రచయితలు, నాటక కర్తల చేతిలో బాగా రూపాంతరం చెందింది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఆ పాత్రతో బూతు డైలాగులు చెప్పించడం ప్రారంభించారు. అలాగే ఆ పాత్రలోని చింతామణి పాత్రను కూడా వ్యాంప్ కేరక్టర్‌గా తయారు చేశారు. దీంతో.. ఈ నాటకాన్ని నిషేధించాలని వైశ్యులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. చివరకు జగన్ సర్కారు ఆ నాటకాన్ని కొన్నాళ్ల క్రితం నిషేధించింది. దీనిపై రఘురామ కృష్ణంరాజు కోర్టును ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: