త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తానంటున్నారు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ.. జగన్‌ను కలిసి ఏపీకి అవసరమైన నూతన వైద్య విధానంపై వివరిస్తామని జయప్రకాశ్‌ నారాయణ అంటున్నారు. అందరికీ ఆరోగ్యానికి ఆచరణసాధ్య నమూనా అనే పుస్తకాన్ని జయప్రకాశ్‌ నారాయణ ఆవిష్కరించారు. పేదలకు మరింత మెరుగైన వైద్యం అందాలంటే నూతన వైద్య విధానం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెబుతున్నారు.


దీని కోసం తాము కుటుంబ వైద్య విధానం రూపొందించామని జయప్రకాశ్‌ నారాయణ రాజమండ్రిలో చెప్పారు. నియోజకవర్గానికి రెండు కేంద్రాల్లో 10 మంది ప్రభుత్వ వైద్యుల ఏర్పాటుతో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని జయప్రకాశ్‌ నారాయణ  సూచిస్తున్నారు. ఈ వైద్య కేంద్రాల ద్వారా పేదలకు చికిత్స అందించడమే ఈ విధానం అని జయప్రకాశ్‌ నారాయణ వివరించారు. రోగులకు  మెరుగైన సేవలు అందించిన వైద్యుడికి ప్రభుత్వం నెలకు లక్ష రూపాయలు ఉండేలా పారితోషకం అందించాలని జయప్రకాశ్‌ నారాయణ సూచిస్తున్నారు.


ఇటీవల ఐక్య రాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అనారోగ్యంవల్ల ఏటా ఐదున్నర కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారని జయప్రకాశ్‌ నారాయణ గుర్తు చేశారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ విజయవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ లో ఈ నూతన విధానం ప్రవేశ పెట్టేందుకు మంచి అవకాశం ఉందని తాను భావిస్తున్నానని జయప్రకాశ్‌ నారాయణ అంటున్నారు.


జయప్రకాశ్ నారాయణ గతంలో లోక్‌ సత్తా అంటూ ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సంస్థ బాగానే పని చేసినా.. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. కానీ.. రాజకీయ పార్టీగా లోక్‌ సత్తాను మలచడంలో  జయప్రకాశ్‌ నారాయణ విఫలమయ్యారనే చెప్పాలి. మేధావిగా పేరున్న  జయప్రకాశ్‌ నారాయణ మాజీ ఐఏఎస్‌ అధికారి కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రజారోగ్య విధానంపై సీఎం జగన్ ను కలుస్తానని చెప్పడం ఆసక్తికరమే. మరి  జయప్రకాశ్‌ నారాయణ సూచనలను జగన్ సర్కారు పాటిస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: