ఏపి సర్కార్ వరుస పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నారు.. ఈ ఏడాదిని విద్యార్థులు ఎలాగైనా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు మరో పీజీ పరీక్షల నోటిఫికేషన్ ను విడుదల చేసారు. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌( 'నీట్‌ - పీజీ 2021') నోటిఫికేషన్‌ ను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, పోస్ట్‌ ఎంబీబీఎస్‌ డీఎన్‌బీ, ఎన్‌బీఈ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.


అర్హత వివరాలు:


ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ లేదా స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తింపు తప్పనిసరి. జూన్‌ 30 నాటికి ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఇందులో 200 మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల మేరకు ప్రశ్నలన్నీ ఎంబీబీఎస్‌ డిగ్రీ స్థాయిలో ఉంటాయి.


పరీక్షా విధానం :


ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్‌ ప్రకారం కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు.

పరీక్షకు సంభందిత ముఖ్య సమాచారం..

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.4,250 తోపాటు జీఎ్‌సటీ రూ.765; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.3,250తోపాటు జీఎ్‌సటీ రూ.585

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 15

ఏపీలో పరీక్ష కేంద్రాలు:

అమరావతి, అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కృష్ణగిరి, కర్నూలు, మదనపల్లి, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

నీట్‌- పీజీ 2021 తేదీ: ఏప్రిల్‌ 18

వెబ్‌సైట్‌: https://nbe.edu.in


ఆసక్తి కలిగిన విద్యార్థులు పైన పేర్కొన్న లింక్ ను పూర్తి చూడవచ్చును..

మరింత సమాచారం తెలుసుకోండి: