అన్నీ వ్యాయామాలలో అతి సులభమైనది వాకింగ్ మాత్రమే. పొద్దున్నే లేచి ప్రతి రోజు 20 నిమిషాలు పాటు వాకింగ్ చేస్తే మీరు ఫిజికల్ గా, మెంటల్ గా దృఢపడతారు. కనీసం రెండు నెలల పాటు మీరు ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటే ఎన్నో ఆరోగ్య లాభాలు మెరుగ్గా కనిపిస్తాయి. టెక్నాలజీ ప్రభావం వల్ల ఈరోజుల్లో చాలామంది ఎంతో నీరసంగా తయారవుతున్నారు. ఇటువంటి వారి కోసం మేము కొన్ని ఆరోగ్య సూత్రాలను ఈ ఆర్టికల్ లో చెప్పబోతున్నాం. 

 

 
నిద్ర లేవగానే హడావిడి గా లేచి మీ పనులు చేయకండి. నిద్ర లేచిన వెంటనే చిన్నగా లేచి ఐదు నిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానం చేయండి. మరొక ఐదు నిమిషాలు స్ట్రెచింగ్ చేయండి. ఆ తర్వాత బ్రష్ చేసి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. ఆ తర్వాత పది నిమిషాల కూర్చొని స్పోర్ట్స్ షూస్ వేసుకొని వాకింగ్ కి బయలుదేరండి. వాకింగ్ చేసే సమయంలో డీప్ బ్రీతింగ్ చేస్తూ చాలా వేగంగా నడవండి. అలా వేగంగా నడవటం వల్ల మీ గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. దీంతో మీ గుండె మీ శరీరంలోని రక్తాన్ని అన్ని భాగాలకు చేరవేస్తుంది. అందువల్ల మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతారు.

 

 
ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలు:
 
1. మీ మెదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. వాకింగ్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే కొన్ని మంచి హార్మోన్ల వల్ల మీరు సంతోషంగా ఫీల్ అవుతారు. వయసు అయిపోయిన తర్వాత వచ్చే మతిమరపును వాకింగ్ చేయడం వల్ల పూర్తిగా నిషేదించవచ్చు. మీ షార్ట్ టర్మ్ మెమరీ కూడా పెరుగుతుంది. 
 
2. మీ కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. 
 
3. వాకింగ్ చేయడం ద్వారా గుండెకు సంబంధించిన ఎన్నో వ్యాధులను రాకుండా నిరోధించవచ్చు. 
 
4. వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు గట్టిగా గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సైజు పెరుగుతుంది. దీంతో మీ శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. నిజానికి ఆక్సిజన్ మీ శరీరంలోని వ్యర్ధలను తొలిగించడంలో ఎంతో పాత్ర వహిస్తుంది. 
 
5. నడవడం ద్వారా మధుమేహ వ్యాధులను నిరోధించవచ్చు.
 
6. వాకింగ్ క్యాన్సర్ వంటి రోగాల బారినుండి మిమల్ని కాపాడుతుంది. అలాగే మీ జీర్ణక్రియను పెంచుతుంది. 
 
7. వాకింగ్ చేయడం ద్వారా మీ కండరాలు గట్టిపడతాయి. మోకాళ్ల నొప్పుల వంటి కండరాల సంబంధిత వ్యాధులు రావు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: