ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం గుండెజబ్బులతోనే.దీనికి కారణం అధిక కొవ్వు శరీరంలో పేరుకుని పోవడం. తద్వారా ఆ కొవ్వు గుండెకి పాకి చివరికి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఇలాంటి సమస్యకు చక్కటి పరిష్కారంగా... అవిసె గింజలు తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవిసె గింజ‌ల్లో అధికంగా ఉండే.ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూస్తాయి. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. ఒక్క గుండె సమస్యలే కాదు .అవిసె గింజలతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.


ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసె గింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని ఉదయం నీళ్లు తీసివేసి గింజలను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది.ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే  అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడంలో అవిసె గింజ‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.అవిసె గింజ‌ల్లో ప‌లుర‌కాల క్యాన్స‌ర్ల‌ను త‌గ్గించే గుణాలున్నాయి. వెంట్రుక‌లు, చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడ దూరమవుతాయి.అవిసె గింజ‌ల‌ను ఉద‌యాన్నే తింటే శ‌క్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కీళ్ల నొప్పులు కూడా పోతాయి.


అవిసె గింజలు పోషకాహార విలువలకీ ఆరోగ్య ప్రయోజనాలకీ పెట్టింది పేరు. ఇప్పుడిప్పుడు వీటిని సూపర్ ఫుడ్ అంటున్నారు కానీ వీటిని నాగరికత తెలిసినప్పటి నుండీ సాగు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ వల్ల ఇవి హెల్దీ ఈటింగ్ క్యాటగిరీలోకి చేరిపోయాయి. ఇవి అరుగుదలకి సహకరిస్తాయి, గుండె జబ్బు, టైప్ 2 డయాబెటీస్, కాన్సర్ యొక్క రిస్క్ ని గణనీయంగా తగ్గిస్తాయి.


అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి, ప్రత్యేకించి గుండె ని ఆరోగ్యంగా ఉంచడంలో వాటి పాత్ర చెప్పుకోదగినది. ఇవి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ని తగ్గిస్తాయి. ఈ హెల్దీ ఫ్యాట్ ఆర్టరీల్లో ఉండే ఇన్‌ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, ఫలితంగా స్ట్రోక్, హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటివి జరిగే రిస్క్ కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: