గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 8వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య‌సంఘటనలు

1956: భారత లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు.

ప్ర‌ముఖుల జననాలు..

1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007).నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8వ తేదీన జన్మించాడు. కౌతవరంలోనే ప్రాథమిక విద్యనభ్యసించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్‌ డిగ్రీ చదివిన తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించాడు. పిదప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్‌ఈబీ) డివిజనల్‌ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపాడు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి. 1974 నుంచి 1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్‌ఈబీ ఛైర్మన్‌గా పనిచేసాడు. విద్యుత్తు రంగానికి విశిష్ట సేవలందించినందుకుగాను 1983లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
1897: దామెర్ల రామారావు, ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. (మ. 1925)

ప్ర‌ముఖుల మరణాలు..

1988: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (జ.1961)ఆయన అసలు పేరు ధనీ రాం. మార్చి 8, 1988లో చంకీలా,, అతని భార్య అమర్ జ్యోత్, అతని బృందంలోని మరో ఇద్దరిని కొంతమంది గుర్తు తెలియని యువకులు హత్య చేశారు. చంకీలా పంజాబ్లో బాగా వేదికల మీద పాడటంలో పేరొందిన గాయకుడు. ఆయన పాటల్లో ఎక్కువగా అతను పుట్టి పెరిగిన పంజాబ్ పల్లె వాసుల జీవన విధానం ఎక్కువగా కనబడుతూ ఉండేది. పల్లెల్లోని అక్రమ సంబంధాలు, మద్యపానం, మత్తు పదార్థాల వాడకం, పంజాబీల సహజమైన రోషం లాంటివి అతని పాటల్లో ముడి సరుకులుగా ఉండేవి. అతను వివాదాస్పదంగా కూడా ప్రాచుర్యం పొందాడు. అతన్ని విమర్శించే వాళ్ళు అతని సంగీతం అసభ్యంగా ఉంటుందని విమర్శిస్తే, సమర్ధించే వాళ్ళు అతను అసలైన పంజాబీ జీవన విధానాన్ని సంగీతంతో కళ్ళకు కడుతున్నాడని భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: