చాలామంది అనారోగ్య ఆహారపు అలవాట్లకు అలవాటు పడటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతోంది . ఇక ఈ సమస్యలను నివారించడానికి పలు రకాల నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి . ఇక ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం , ఆహారంలో తప్పనిసరిగా పండ్లను తీసుకోవడం వంటి నియమాలను పాటిస్తే చెడు కొలెస్ట్రాలను దూరం చేసుకోవచ్చు.


ముఖ్యంగా చెడు కొలెస్ట్రాలను దూరం చేసే పండ్లు మనం ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడంలో విటమిన్ సి, ఫైబర్ సహాయపడుతుంది. నిమ్మ జాతి పండ్ల లో విటమిన్ సి , ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.   కాబట్టి శరీరంలోని వ్యాధులను కూడా సులభంగా దూరం చేసుకోవచ్చు. నేరేడు పండ్లు కూడా మీకు గుండె సమస్యలు రాకుండా సహాయపడతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను  నియంత్రించడానికి సమర్ధవంతంగా పనిచేస్తాయి . ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఆరోగ్య నిపుణుల సలహా మేరకు నేరేడు పండ్లు తీసుకోవచ్చు.


అరటి పండ్లు కూడా చక్కటి ప్రయోజనాలను కలిగిస్తాయి . అరటిపండ్లలో ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇకపోతే పొట్ట సమస్యలను కూడా తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ నియంత్రించడంలో అరటిపండు అద్భుతమైన ఆహారం.  ఇందులో గ్లూకోజ్ పరిమానాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని దృఢంగా చేయడానికి సహాయపడతాయి.. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు అరటిపండు తీసుకోవడం ఉత్తమం.. ముఖ్యంగా మీరు ఏదైనా పనులను తీసుకోవాలనుకుంటే ఉదయం సమయంలోనే తీసుకోవడం మంచిది. ఇక సిట్రస్ పండ్ల విషయానికి వస్తే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకుంటే ఫలితాలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: