జీవితంలో ఎవరికైనా రుణం ఉంటే వెంటనే తీర్చేయాలి.. లేకుంటే లావైపోతారు అంటూ కామెడీ చేయను కానీ.. కొన్ని రుణాలు మాత్రం తీర్చేసుకోవాలి. అబ్బే నేను ఎవరికీ రుణం లేను అంటారా.. ఉంటారు.. తప్పకుండా ఉంటారు. అసలు మనిషి అన్న ప్రతి ఒక్కరికీ ఈ రుణం తప్పదు.

 

 

ఇంతకీ మీరు రుణం ఉన్నది ఎవరికో చూద్దాం.. ముందుగా తల్లి దండ్రులకు.. ఎందుకంటే.. పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే వారు బైటికి తరిమేయరు. తల్లీ, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు.

 

 

అందుకే.. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారని బిడ్డల్లా చూసుకోవటమే. మల ముత్రాలకు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్థంతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి.

 

 

ఇక ఆ తర్వాత లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నేర్పినందుకు గురు ఋణాన్ని తీర్చుకోవాలి. వీరి తర్వాత మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవం ఋణం కూడా తీర్చుకోవాలి. దీనికి భక్తి , ధర్మం మార్గాలు. ఆ తర్వాత సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: