ప్రొడక్షన్ వాల్యూస్, ప్రభాస్ మాసీ లుక్, సినిమాటోగ్రఫీప్రొడక్షన్ వాల్యూస్, ప్రభాస్ మాసీ లుక్, సినిమాటోగ్రఫీస్టోరీ, వి.ఎఫ్.ఎక్స్ వర్క్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ
వాజి సిటీలో అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న పృధ్వి రాజ్ (టిను ఆనంద్) తన సామ్రాజ్యానికి కొడుకు దేవరాజ్ (చుంకీ పాండే)ను వారసుడిని చేయాలని అనుకుంటాడు. రాయ్ గ్రూప్ వేరే సెటిల్మెంట్స్ చేస్తుంది. రాయ్ అనుమాస్పదంగా మృతిచెందడంతో అతని కొడుకు విశ్వక్ (అరుణ్ విజయ్) గ్యాంగ్ స్టర్ సామ్రాజ్యానికి వారసుడు అవుతాడు. అయితే ముంబైలో 2 లక్షల కోట్ల దొంగతనం జరుగుతుంది. మరోపక్క ఓ కేసు డీల్ చేసేందు ఈ ఆపరేషన్ లో అండర్ కవర్ కాప్ గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ని రంగంలోకి దించుతారు. క్రైం బ్రాంచ్ కు చెందిన అమృత నాయర్ (శ్రద్ధ కపూర్) తో అశోక్ జాయిన్ అవుతాడు. ఇంతకీ రాయ్ ను చంపింది ఎవరు..? రెండు లక్షల కోట్ల స్కాం ఎలా జరిగింది..? అశోక్, అమృతాల ప్రేమకు ముగింపు ఏంటన్నది సినిమా కథ.      




ప్రభాస్ అశోక్ చక్రవర్తి పాత్రలో అదరగొట్టాడు. తన మార్క్ మాస్ లుక్స్ యాక్షన్ సీన్స్ తో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశాడు. యాక్షన్ పార్ట్ లో ప్రభాస్ తన ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేశాడు. ఇక శ్రద్ధ కపూర్ కూడా మెప్పించింది. సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ అందరు బాగా చేశారు. సినిమా మొత్తం బాలీవుడ్ ఆర్టిస్టులతో నిండిపోయింది. మిగతా వారంతా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.



మధి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. ఇక జిబ్రన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌ వంటి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ యొక్క వర్క్ బాగుంది. కథ, కథనాల విషయంలో డైరక్టర్ సుజిత్ ఇంకాస్త వర్క్ అవుట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా ఉన్నాయి. 



గ్యాంగ్ స్టర్ సినిమాల్లో యాక్షన్ సీన్స్, ట్విస్టులు కామన్. తెలుగు సినిమా ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు చూపించని యాక్షన్ సీన్స్ తో సాహో వచ్చిందని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది. ఇంటర్వల్ బ్యాంగ్ కూడా అదిరింది అయితే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వచ్చే వరకు సినిమా నెమ్మదిగా ఊహించినట్టే జరుగుతుంది.


మళ్లీ ప్రీ క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంది. అయితే ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీతనంతో తీసిన సాహో ఇంకాస్త ఊహించని ట్విస్టులు స్క్రీన్  ప్లే ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఒక సినిమా అనుభవంతో సుజిత్ సాహోని తన శక్తిమేరకు కృషి చేశాడు.


ఫైనల్ గా సాహో యాక్షన్ ప్రియులకు నచ్చేలా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ ఐ ఫీస్ట్ గా ఉంటుంది. సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టులు ఎక్కువవడం వల్ల అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఫైనల్ గా సాహో ఆశించిన స్థాయిలో యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంది. అయితే కథ ఇంకాస్త కొత్తగా ఉంటే బాగుండేదని చెప్పొచ్చు.



ప్రభాస్, శ్రద్దాదాస్, విజయ్ కుమార్,జాకీ ష్రాఫ్, మందిరాబేడీప్రభాస్ 'సాహో'.. ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: