
అలా కొన్ని సినిమాల లో నటించింది.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ కి దూరమైంది.. కానీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలను, తన గురించి అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులకు దగ్గరవుతూ వస్తుంది. కాగా , ఆమె గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సమీరా ఓ కోలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యం లో తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారామె.
తమిళ్ లో ఆర్య, విశాల్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో సమీరా రెడ్డి నటిస్తోందనే టాక్ బయటకొచ్చింది. ఈ సినిమాలో సమీరా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఆ సినిమా కు ఆమె పాత్రే హైలెట్ అట..తాజాగా ఈ విషయం పై ఆమె స్పందించింది. అవన్నీ నిజం కాదు.. తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. దీంతో సమీరా రీ ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.మొత్తానికి సమీరా రెడ్డి కి సినిమాల లో నటించడానికి ఇంట్రెస్ట్ లేదని తేలిపోయింది.