భారత చలన చిత్ర పరిశ్రమలో నటించే ఎంతో మంది హీరోయిన్లు, ఏదో ఒక సందర్భంలో కొంచెం లేటుగా అయినా సరే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతూ ఉంటారు.. కానీ తమ నటనతో, అందంతో, సమయానికి తగ్గ ప్రదర్శన ఇస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. అయితే ఎంతోమంది నటీమణులు  జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు.. మరీ ముఖ్యంగా దానికి కారణాలు  ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం..


నగ్మా :
అప్పట్లో దక్షిణాది ని ఒక ఊపు ఊపిన నగ్మా, ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఈమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే క్రికెటర్ గంగూలీ ని పీకల్లోతు వరకు ప్రేమించింది. అయితే ఆ ప్రేమ విఫలమవడంతో, మరోసారి నటుడు శరత్ కుమార్ తో ప్రేమాయణం జరిపి, అది పెళ్లి వరకు వెళ్ళింది. కానీ ఏవో కారణాల చేత ఆగిపోయింది. ఆ తర్వాత సినిమాలు వదిలేసి రాజకీయాలకు ప్రవేశించింది.. ఇక ప్రస్తుతం ఈమె రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరొకవైపు తన సిస్టర్ ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించిన రోషిణి,జ్యోతిక, నగ్మా వీరు ముగ్గురూ అక్కాచెల్లెలు.

టబు :
కూలీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన టబు, నాగార్జున సరసన నిన్నే పెళ్ళాడుతా సినిమాల్లో నటించి, అందరినీ మెప్పించింది.. అయితే ఈమె 48 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం నిన్నే పెళ్ళాడుతా సినిమా తీసేటప్పుడు నాగార్జున తో ప్రేమలో పడింది. ఇక ఆ ప్రేమ కాస్త విఫలమవడంతో ఈమె పెళ్లి చేసుకోలేదు అని తెలుగు సినీ పరిశ్రమలు వార్తలు వినిపిస్తున్నాయి..


శోభన :
నటి శోభన 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఇందుకు కారణం ఈమె ఒక మలయాళ హీరో ని ప్రేమించింది.  అయితే అతను మోసం చేయడంతో జీవితంలో ప్రేమకు, పెళ్లికి దూరంగా ఉంటూ వస్తోంది.. అయితే ఈమె ఒక పాపను దత్తత తీసుకొని, ఆ పాప ఆలనా పాలనా చూసుకుంటూ వస్తోంది..

సితార :
హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన సితార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాని కి తల్లిగా నటించి,అందరినీ మెప్పించింది. అయితే సితార కు ప్రస్తుతం 45 సంవత్సరాలు అయినప్పటికీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు..  అందుకు కారణం ఆమె సహ నటుడు  మురళి తో ప్రేమలో పడితే,  అది విఫలమవడంతో ప్రేమకు, పెళ్లికి దూరంగా ఉంటూ వస్తోంది.

కౌసల్య :
పంచదార చిలక, అల్లుడుగారొచ్చారు ఇలాంటి సినిమాలలో నటించి, తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యింది. ఈమె కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కన్నడలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ, బుల్లితెరపై సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం తన కుటుంబ పోషణ ను చూసుకుంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: