మన ఇండియా లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు ఉండే ఇమేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు అయినా ఆయన మాట్లాడే మాటలైనా ఫ్యాన్స్ పిచ్చేక్కిపోతారు. ఇతర హీరోల కంటే కాస్త భిన్నంగా ఉంటాడు ఈ నవాబ్ గారు. ఇప్పుడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఆయన ఇమేజ్ కాస్త డామేజ్ అయినట్టు కనపడుతుంది. అయితే భవిష్యత్తు సినిమాల మీద ఆయన ఫుల్ గా ఫోకస్ పెట్టి ఎలా అయినా సూపర్ హిట్స్ కొట్టాలని పట్టుదలగా కనపడుతున్నారు.

ఆయన ఏదైనా ప్రాంతానికి పర్యటనకు వెళ్తే అక్కడ ఫ్యాన్స్  ఆయనను చూడటానికి ఏ రేంజ్ లో వస్తారో మనం టీవీ ల్లో చూస్తూనే ఉంటాం. అంత ఇమేజ్ ఉన్న కింగ్ ఖాన్ తన బాడీ గార్డ్ ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని టాక్. వాళ్లకు భారీగా జీతాలు ఇస్తాడు ఈ స్టార్ హీరో. షారూఖ్ ఖాన్ విలాసవంతమైన జీవనశైలికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడని అందుకే భారీగా కార్లు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారని అంటారు. భారతదేశంలో మరియు విదేశాలలో కోట్ల విలువైన ఆస్తులు, వివిధ వ్యాపారాలలో పెట్టుబడులతో రిచ్ గా ఉన్నాడు.

ఆయన భద్రతను రవి సింగ్ అనే బాడీ గార్డ్ చూసుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే రవి సింగ్ తనతోనే ఉంటాడు. వాళ్లకు ఒక టైం అంటూ ఉండకపోవడం అలాగే సెలవలు కూడా ఉండకపోవడంతో జీతాలు కూడా భారీగానే ఇస్తారు. మీడియా నివేదికల ప్రకారం ఏటా దాదాపు రూ .2.7 కోట్లు చెల్లిస్తారు. గత దశాబ్దం నుంచి రవి... షారుఖ్ వెంటే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత అంగరక్షకుడు జితేంద్ర షిండే, అనుష్క శర్మ సెక్యూరిటీ సోనులకు కూడా భారీగా జీతాలు ఉన్నాయి. మన టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలకు భారీగా జీతాలు ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: