నందమూరి నటసింహం బాలకృష్ణ వైవిధ్యమైన కథల్లో నటించాలని తపించిపోతున్నాడు. తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని తపించిపోతుంటాడు. తాజాగా బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా వస్తోందనగానే సినిమా ఇండస్ట్రీలో రకరకాల వార్తలు మొదలయ్యాయి. కమర్షియల్‌ కమ్‌ మెసేజ్‌ మూవీస్ తీసే కొరటాల, బాలయ్యతో అదే స్టైల్‌లో సినిమా తీస్తున్నాడనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు బాలకృష్ణ తో కొరటాల మల్టీస్టారర్‌ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వస్తోంది.

బాలకృష్ణ పేరు చెప్పగానే అభిమానులకు మాస్, యాక్షన్, ఫ్యాక్షన్‌ సినిమాలే గుర్తుకొస్తాయి. ఇక కొరటాల శివ కమర్షియల్‌ కమ్‌ మెసేజ్ ఓరియెంటెడ్‌ మూవీస్‌ తీస్తుంటాడు. ఇలాంటి డిఫరెంట్‌ ఇమేజెస్‌ ఉన్న వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందనగానే అంచనాలు మొదలయ్యాయి. బాలకృష్ణ కోసం కొరటాల ఎలాంటి కథ రాస్తున్నాడో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ' సినిమాతో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో హ్యాట్రిక్‌ మూవీగా రూపొందిన 'అఖండ' డిసెంబర్‌2న విడుదలవుతోంది. ఇక లేటెస్ట్‌గానే గోపీచంద్‌ మలినేని సినిమా కూడా స్టార్ట్ చేశాడు బాలయ్య. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

కొరటాల శివ నెక్ట్స్‌ ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలో ఒక హీరోగా బాలకృష్ణ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలయ్యతో డిస్కషన్స్‌ కూడా అయ్యాయని, ఎన్.బి.కె. గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చాడనే టాక్ వస్తోంది. మరి మరో హీరోగా నందమూరి స్టార్స్‌ ఉంటారా లేక బయటివాళ్లని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.


బాలయ్య అభిమానులయితే అఖండ తర్వాత ఆయన నటించబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి  కథలో నటిస్తాడో అనే ఉత్కంఠ వారిలో నెలకొంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంది అనగానే వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: