ఇటీవల కాలంలో అందరు హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తాము కూడా పాన్ ఇండియా హీరోలుగా ఎదగాలని భావిస్తున్నారు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి కాబట్టి అన్ని భాషలలో అందరు హీరోలు కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు తెలుగు లో కాకుండా వేరే భాషలో సినిమా చేయాలి అంటే తప్పకుండా ఆ భాషకు సంబంధించిన దర్శకుడితో అక్కడ సపరేట్ గా సినిమా చేయాలి. అప్పుడే సదరు హీరో కి అక్కడ కూడా గుర్తింపు వస్తుంది.

ఆ విధంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఆరంగేట్రం చేయాలని గతంలో చా ల్లా సార్లు ప్రయత్నించాడు. అక్కడ కూడా తన నటన రుచి చూపించాలని తన సత్తా చాటాలని చాలా ప్రయత్నాలు చేసాడు. కొంత మంది దర్శకులతో కలిసి బాలీవుడ్ లో సినిమాలు చేసే విధంగా సన్నాహాలు కూడా చేశాడు. కానీ ఏదో ఒక కారణం వల్ల ఆ ప్రయత్నం వెనకడుగు వేసేది. కానీ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పుణ్యమా అంటూ ఎన్టీఆర్ చిరకాల కోరిక తీరుతుంది. ఆయన బాలీవుడ్ లో నటించాలనే కోరిక ఇప్పటికి తీరింది అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో దీని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా మరో కథానాయకుడు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా తనదైన శైలిలో నటించాడు అని తెలుస్తుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించాడు. మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా తర్వాత వస్తున్న ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ సినిమా గురించి అంచనాలను పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా కోలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి సినిమా పై అంచనాలను మరింతగా పెంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: