
ఆ తర్వాత వర్ష ఇమ్మానియేల్ జోడిని హైలెట్ చేశారు. వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇక వీరి లవ్ ట్రాక్ పైన ఎన్నో ఈవెంట్స్ కూడా చేశారు. ఇక ఈ లవ్ స్టోరీ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు రాకింగ్ రాకేష్ సుజాత లవ్ ట్రాక్ ని తెరమీదకు తీసుకువచ్చారు. దీంతో గత కొంత కాలం నుంచి సుజాత రాకింగ్ రాకేష్ లవ్ ట్రాక్ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది అని చెప్పాలి. వీరిద్దరూ జబర్దస్త్ స్టేజి మీద ఒకరి మీద ఒకరు అమితమైన ప్రేమను కురిపించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.
దీంతో రాకింగ్ రాకేష్ సుజాత నిజంగానే ప్రేమ లో ఉన్నారా లేదా అంతకుముందు ప్లాన్ చేసినట్లు కానీ ఇది కూడా ప్లాన్ చేశారా అన్నది తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజన్లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో భాగంగా రాకింగ్ రాకేష్ సుజాత పెళ్లికి రెడీ అయ్యారూ అన్నట్లుగా చూపించారు. ఏకంగా జబర్దస్త్ స్టేజి మీద ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ఆ తర్వాత నీకు కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను అనిమాట ఇవ్వలేను కానీ కన్నీళ్లు వచ్చినప్పుడల్లా నేను నీ పక్కనే ఉంటాను అంటూ ఒక ఎమోషనల్ డైలాగ్ కూడా చెప్పాడు రాకింగ్ రాకేష్. దీంతో వీరి నిజమైన లవ్వా లేకపోతే ప్లాన్ ప్రకారం క్రియేట్ చేసిన లవ్వా తెలియక అందరూ కన్ఫ్యూజన్లో మునిగిపోతున్నారు..