అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుణ్ మోహన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ 2019 వ సంవత్సరం విడుదలైన కన్నడ సినిమా ఒంధ్‌ కథే హెళ్ల మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నాని హీరోగా తెరకెక్కిన నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు లో శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు లో నటించినది తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రం ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రియాంక అరుల్ మోహన్ పోయిన సంవత్సరం నటించిన డాక్టర్ సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు.

ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ రెండవసారి డాన్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించిన డాక్టర్ మరియు డాన్  సినిమాలు రెండు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇలా శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు శివ కార్తికేయన్ బాగా కలిసి వచ్చాడు అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: