ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 1 మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా, నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది.

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా, సునీల్ , రావు రమేష్ ,  అనసూయ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ లో లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ కు వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ భారీ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప పార్ట్ 2 మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే పుష్ప పార్ట్ 2  సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ పుష్ప పార్ట్ 2  సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: