ఇటీవల కాలంలో బుల్లితెరపై ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయన్న విషయం తెలిసిందే. వినూత్నమైన  కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు. అయితే ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు ప్రసారం అవుతున్న సమయంలోనే ఇక ప్రతి పండక్కి కూడా ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా తొమ్మిది రోజులపాటు వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.


 ఇక ప్రతి ఫెస్టివల్ కి ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించే ఈటీవీ నిర్వాహకులు ఇక వినాయక చవితి ఎందుకు వదిలేస్తారు.. వినాయక చవితికి కూడా ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మన ఊరి దేవుడు అంటూ ఒక స్పెషల్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులలో ఆసక్తిని పెంచారు. ఇటీవలే ఇక మరో ప్రోమోని విడుదల చేశారు అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో షో రేటింగ్ పెంచుకోవడానికి టిఆర్పి స్టంట్లు చేస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమంలో. ఇటీవలే విడుదలైన ప్రోమో లో కూడా ఇలాంటిదే చేశారు అనేది తెలుస్తుంది.


 మొన్నటికి మొన్న విడుదలైన మొదటి ప్రోమో లో హైపర్ ఆది ట్యూబ్ లైట్ తో వర్ష నడుము మీద కొట్టడంతో ఇక వర్షకు గాయం అయ్యి కింద కుప్పకూలి పోవడం లాంటివి చూపించారు. ఇక ఇటీవలే విడుదలైన ప్రోమో లో కూడా ఇదే హైలైట్ గా చూపించారు. ఒదిన చేతిలో రెండు ట్యూబ్ లైట్స్ పట్టుకున్న హైపర్ ఆది వీటితో ఒక గేమ్ ఉంటుంది అంటూ చెబుతాడు. వాటితో  గేమ్ ఆడేందుకు ఇమాన్యుయెల్, వర్ష ఒప్పుకోరు. అయితే  అంతలోనే హైపర్ ఆది ఇమాన్యుయేల్ వీపుపై ట్యూబ్ లైట్ కొడతాడు. దీంతో అతను ఒక్కసారిగా కింద పడిపోతాడు. తర్వాత వర్షా హైపర్ ఆదిని కొడుతుంది. వెంటనే హైపర్ ఆది వర్షం నడుమ్మీద కొట్టగానే కింద పడిపోతుంది.  ఇది చూసిన ప్రేక్షకులు ఓవర్ యాక్టింగ్ చేసిన ఆ ముగ్గురికి కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: