బెల్లంకొండ సురేష్ తన ఇద్దరు కొడుకులను కూడా హీరోలుగా పరిచయం  చేసిన విషయం తెల్సిందే..అయితే  ఇప్పటికే పెద్దబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు.ఇకపోతే ప్రస్తుతం ఏకంగా బాలీవుడ్ లో తెలుగు సూపర్ హిట్ చిత్రం 'చత్రపతి' ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.ఇక  రాజమౌళి సినిమా అది కూడా ప్రభాస్ పాత్రను బెల్లంకొండ బాబు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.కాగా చత్రపతి హిందీ రీమేక్ కు వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తూ ఉండగా పెన్ స్టూడియో బ్యానర్ వారు హిందీ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలావుంటే ఇటీవలే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ను డిసెంబర్ లో విడుదల చేసే విషయమై చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే మరో వైపు తెలుగు లో మరిన్ని సినిమాలను చేసేందుకు బెల్లంకొండ బాబు కథలు వింటూనే ఉన్నాడు.అయితే తాజాగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమాకు సైన్ చేశాడట.పోతే  గతంలో నిఖిల్ హీరోగా రూపొందిన అర్జున్ సూరవరం సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన టిఎన్ సంతోష్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు బెల్లంకొండ బాబు ఓకే చెప్పాడు. కాగా వీరిద్దరి కాంబోలో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.ఇకపోతే తెలుగు లో రూపొందబోతున్న ఈ సినిమాను..

పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేసేలా సినిమా కాన్సెప్ట్ ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.అయితే  ఒక వేళ చత్రపతి రీమేక్ సినిమా కనుక హిందీలో సూపర్ హిట్ అయితే సంతోష్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ను హిందీలో డబ్ చేసి భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.పోతే మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాలిడ్ సూపర్ హిట్.. కమర్షియల్ బ్లాక్ బస్టర్ లేకుండానే వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.కాగా  ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయినా కమర్షియల్ గా బెల్లంకొండ బాబుకు బ్రేక్ ను ఇస్తాయా అనేది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: