టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే నిఖిల్ కెరీర్ లో మంచి విజయం సాధించిన మూవీ లలో కార్తికేయ మూవీ ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన కార్తికేయ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా నిఖిల్ కి కూడా మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది. కార్తికేయ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహించాడు. ఇలా అప్పట్లో మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో తాజాగా నిఖిల్ హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఆగస్టు 13 వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ లభించడంతో ఇప్పటికి కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఇప్పటి వరకు 21 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 53.46 కోట్ల షేర్ , 107.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: