తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా ఇప్పటికే ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న శ్రీ విష్ణు గత కొంత కాలంగా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయాలను అందు కోవడంలో కాస్త వెనుక బడిపోయాడు. ఈ హీరో ఆఖరు గా భళా తందనాన అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో క్యాథరిన్ , శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో అల్లూరి అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 23 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది.

మూవీ ట్రైలర్ ని ఈ రోజు అనగా సెప్టెంబర్ 16 వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే అల్లూరి మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ తో శ్రీ విష్ణు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: