కొరియోగ్రాఫర్ గా ప్రేక్షకులను ఎంతో అలరించిన ప్రభుదేవా ఇప్పుడు దర్శకుడిగా కూడా అలరిస్తున్నాడు. సినిమా పరిశ్రమలోకి కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎంతో మంది పెద్ద హీరోలతో ఈ హీరో కొరియోగ్రాఫర్ గా చేశాడు. ఆ తర్వాత హీరో గా, నటుడిగా కూడా రాణించాడు. ఎప్పుడైతే హీరో గా మారిపోయాడో అప్పుడే దర్శకుడిగా కూడా చేయడం మొదలుపెట్టాడు. బాలీవూడ్ లో పెద్ద పెద్ద హీరోలతోనే కలిసి పనిచేసి ప్రభుదేవా అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నటుడిగా, కొరియోగ్రాఫర్ గ, డైరెక్టర్ గా మూడు పాత్రల్లో రాణిస్తూ అందరిని ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోని పాటకు కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. ఈ పాటకు సల్మాన్ ఖాన్ కూడా చేయడం విశేషం. దసరా కానుకగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుండగా ఈ సినిమా తప్పకుండ అందరిని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ద్వారా మళ్ళీ కొరియోగ్రాఫర్ గా వరుస సినిమాలు చేస్తున్నాడో చూడాలి. ఇటీవల బాలీవుడ్ లో వరుస సినిమాలు డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్న ప్రభుదేవా ప్రధాన పాత్రలో ఓ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే తెలుగు లో అయన దర్శకత్వం వహించి చాలా రోజులే అయిపొయింది. ఇప్పటిదాకా అయన సినిమాలు చేసింది లేదు. ఈనేపథ్యంలో అయన తెలుగులో సినిమా చేయడానికి రంగం సిద్ధం అవుతుండడం విశేషం. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఓ సినిమా చేయడానికి అయన సిద్ధమయ్యారని చెప్తున్నారు. దానికి సంబందించిన న్యూస్ ఇప్పుడు తెగ హల్చల్ అవుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. గతంలో ఆయన చిరంజీవిని ఓ సినిమా తో డైరెక్ట్ చేశారు. శంకర్ దాదా జిందాబాద్ సినిమా ప్రేక్షకులను పెద్ద గా ఆకట్టుకోలేదు. ఈనేపహత్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. చిరంజీవి చేతిలో ఇప్పుడు పలు సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తవ్వాలి అంటే వచ్చే ఏడాది పడుతుంది. తొందరలోనే ఈ సినిమా అనౌన్స్ కూడా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: