కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన నెక్స్ట్ సినిమాకు ఎప్పుడు చేయని సాహసం చేస్తున్నాడు. ఇప్పటికే తన నటనతో అందరి మన్నలను పొంది నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న సూర్య తన రాబోయే సినిమాలో ఒకటి రెండు కాదు ఏకంగా పది పాత్రల్లో పది వేషదారల్లో నటిస్తున్నాడు. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. ఈ సినిమాలో సూర్య యోధుడుగా నటిస్తున్నాడు. సినిమాలో సూర్య 10 డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుంది. సూర్య ఈ తరహా పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

సూర్య ఈమధ్య కమర్షియల్ సినిమాల కన్నా సామాజిక అంశాలు.. సోషల్ కాజ్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మాత్రం పక్కా కమర్షియల్ సినిమాగా వస్తుంది. ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమాపై సూర్య చాలా నమ్మకంగా ఉన్నారు. శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారని టాక్. సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ వస్తుంది.

సూర్య మార్కెట్ గురించి మాట్లాడుకుంటే తమిళంలో సూపర్ హీరో అయిన సూర్య తెలుగులో కూడా మంచి మార్కెట్ కలిగి ఉన్నారు. సూర్య చేస్తున్న సినిమాలన్నీ తెలుగులో కూడా మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. శివ సినిమాలో సూర్య తన నట విశ్వరూపం చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా గురించి కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్స్ నడుస్తున్నాయి. కోలీవుడ్ నుంచి రాబోతున్న మరో బాహుబలి అంటూ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మణిరత్నం పిఎస్ 1 కి ధీటుగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. మరి సూర్య సినిమా ఎలా ప్లాన్ చేస్తున్నారో ఆయన ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: